జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) చీఫ్ యాసిన్ మాలిక్‌ను వచ్చేనెల 24 వరకు జ్యుడీషియల్ కష్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని పటియాలా కోర్టు నిర్ణయం తీసుకుంది. 2017లో ఆయనపై దాఖలైన ఉగ్రవాదులకు నిధులు చేరవేరుస్తున్నారన్న కేసులో కోర్టు ఈ నిర్ణయించింది. మరోవైపు మాలిక్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు అనుమతించాలంటూ తీహార్ జైలు అధికారులు పటియాలా కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం… దీనిపై స్పందన తెలియజేయాలంటూ మాలిక్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 10న యాసిన్ మాలిక్‌ను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) 22 వరకు తమ కస్టడీలో ఉంచి విచారించింది. JKLF పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన రెండు వారాల్లోనే NIA ఈ మాజీ మిలిటెంట్ నాయకుడిని అరెస్ట్ చేసింది. యాసిన్ మాలిక్ పై రెండు సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.
