జులైలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఇవే...

జులైలో తిరుమలలో  విశేష ఉత్సవాలు ఇవే...

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ పీఆర్‌ఓ విభాగం  వెల్లడించింది. జూలై 1న శని త్రయోదశి, 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురుపూర్ణిమ, 13న సర్వఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్‌ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవా­రి తోటకు వేంచేయడం, 30న నారాయణ­గిరిలో ఛత్రస్థాపనోత్సవం ఉంటాయని తెలిపింది.

ఇదిలా ఉండగా తిరుమల  కొండపై భక్తుల ఒక్కసారిగా రద్దీ తగ్గిపోయింది. వీకెండ్‌లో కూడా పెద్దగా రద్దీ కనిపించకపోగా.. మంగళవారం (జూన్ 27) శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సిన అవసరం రాలేదు. శ్రీవారి ఉచిత దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన పని లేకుండా నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.  మంగళవారం (జూన్27) న  స్వామివారిని 69,143 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,145మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.