NCPI గ్రీన్ సిగ్నల్.. జంప్ యాప్ నుంచి యూపీఐ సేవలు

NCPI గ్రీన్ సిగ్నల్.. జంప్ యాప్ నుంచి యూపీఐ సేవలు

హైదరాబాద్, వెలుగు: ఏఐ ఆధారిత ఫిన్‌‌‌‌టెక్ ప్లాట్‌‌‌‌ఫారమ్ జేయూఎంపీపీ (జంప్​) తన యాప్‌‌‌‌ ద్వారా యూపీఐ పేమెంట్​సేవలను ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నుంచి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్​లైసెన్సు దక్కించుకుంది.  సాధారణ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఫుల్ స్టాక్ ఫైనాన్షియల్ సూపర్ యాప్‌‌‌‌గా మారామని తెలిపింది. యాప్​ ద్వారా డబ్బు బదిలీలు, బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జ్‌‌‌‌లు చేసుకోవచ్చు. ఇప్పటికే డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, సిప్  సేవలు అందుబాటులో ఉన్నాయి.