హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖ ఆద్వర్యంలో నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు జనవరి 10వ తేదీ బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కలిసి ఆహ్వానించారు.
మంత్రితోపాటు యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్. మామిడి హరికృష్ణ, తదితరులు కలిశారు. జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది.ఈ ఫెస్టివల్ కు మూడు రోజుల సమయమే ఉండటంతో అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులతో ఈ ఫెస్టివల్ పై మంత్రి జూపల్లి చర్చించారు.
