జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

గద్వాల : కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద, స్థానికంగా కురుస్తున్న వానలతో జూరాల ప్రాజెక్టుకు బుధవారం వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు దగ్గర 10 గేట్లు  ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల డ్యాం కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా 4.924 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 10 గేట్లను ఎత్తి 85773 క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 86 వేల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో ఉంది. 
ఎస్సారెస్పీ ఆరు గేట్లు ఎత్తిన్రు.

తిమ్మాపూర్ : సిద్దిపేట జిల్లా ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఎస్సారెస్పీ అధికారులు బుధవారం ఆరు గేట్లను ఒక ఫీట్ ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. ఎల్ఎండీ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా 21.182 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం రిజర్వాయర్​లోకి 15948 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ఇన్​ఫ్లో ఔట్ ఫ్లో లను నియంత్రించేందుకు బుధవారం ఉదయం నాలుగు గేట్లను, రాత్రి వేళలో మరో రెండు గేట్లను ఎత్తారు. మానేరు పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్తులు, మత్స్యకారులు, పశువుల కాపరులు నదిలోకి వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ శాఖ అప్రమత్తం చేయాలని ఎస్ఆర్​ఎస్సీ ఎస్​సీ శివకుమార్ ఆదేశించారు.