Phone Safety: ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీ ఫోన్ సేఫ్.. దొంగిలించినా ఎక్కడున్నా పట్టుకోవచ్చు..

Phone Safety: ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీ ఫోన్ సేఫ్.. దొంగిలించినా ఎక్కడున్నా పట్టుకోవచ్చు..

Lost Phone Recovery: ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరువచ్చాయి. ప్రముఖ టెలికాం సంస్థలు 4జీ, 5జీ సేవలను విస్తరించటంతో స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు భారీగా పెరిగారు. చాలా మంది ఇళ్లలో కనీసం మనిషికి ఒక్కటి చొప్పున స్మార్ట్ ఫోన్లు ఉండటం సహజంగా మారిపోయింది. ఇదే క్రమంలో చాలా చోట్ల ఫోన్ల చోరీలు సైతం సర్వ సాధారణంగా మారిపోయింది. 

ఇలాంటి సందర్భంలో ఖరీదైన స్మార్ట్ ఫోన్లను వాడుతున్న ప్రజలు కేవలం మూడు సెట్టింగ్స్ ఆన్ చేసి పెట్టుకుంటే వారు తమ ఫోన్ కోల్పోయినప్పటికీ వాటిని తిరిగి పొందటానికి వీలు ఉంటుంది. 

1. ముందుగా ఫోన్ దొంగిలించిన తర్వాత దానిని వెంటనే స్విచ్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. దీనిని నిరోధించేందుకు మీ స్మార్ట్ ఫోన్లలో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్లి అన్‌లాక్ టు పవర్ ఆఫ్ ఫోన్ ఆప్షన్ యాక్టివేట్ చేయాలి. దీంతో వారు ఫోన్ ఆఫ్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించవు.

2. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం కుదరని పక్షంలో సదరు దొంగ చేసే ప్రయత్నం మెుబైల్ ఫోన్ ను కనీసం ఏరోప్లేన్ మోడ్  ఆన్ చేయాలని చూస్తారు. ఇలా చేయటం వల్ల సదరు ఫోనుకు వచ్చే కాల్స్, మెసేజెస్ ఆపాలని వారు చూస్తుంటారు. దీనిని అడ్డుకునేందుకు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అలౌవ్ క్విక్ సెట్టింక్స్ ఆన్ లాక్ స్కీన్ ఆఫ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టడం కూడా కుదరదు.

3. ఇక చివరిగా చేసేదేం లేక ఫోన్ సిమ్ కార్డును తొలగించటానికి దొంగలు ప్రయత్నిస్తారు. అయితే సిమ్ తొలగించినప్పటికీ ఫోన్ ఎక్కడ ఉందనే వివరాలను ట్రాక్ చేసేందుకు వీలుగా.. సెట్టింగ్స్ లో ఫైండ్ మై డివైజ్ ఆన్ చేసి అందులో విత్ నెట్‌వర్క్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆప్షన్ యాక్టివేట్ చేయాలి. ఇలా చేయటం వల్ల సిమ్ కార్డు తొలగించినప్పటికీ సదరు ఫోన్ ఎక్కడ ఉందనే వివరాలను కనిపెట్టవచ్చు. 

అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు పైన పేర్కొన్న మూడు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవటం చాలా ముఖ్యం. పొరపాటున ఫోన్ దొంగిలించబడినప్పటికీ దానిని రికవర్ చేసేందుకు ఈ సెట్టింగ్స్ ఎక్కువగా సహాయపడతాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.