మ‌‌‌‌నుషుల‌‌‌‌కి ఆత్మలు ఉన్నట్టే.. ఒక ఊరికి ఆత్మ ఉంటే

మ‌‌‌‌నుషుల‌‌‌‌కి ఆత్మలు ఉన్నట్టే..  ఒక ఊరికి ఆత్మ ఉంటే

మ‌‌‌‌నుషుల‌‌‌‌కి ఆత్మలు ఉన్నట్టే..  ఒక ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ త‌‌‌‌న క‌‌‌‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే క‌‌‌‌థాంశంతో తెర‌‌‌‌కెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’.  శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క‌‌‌‌ళ్యాణ్ రామ్ ‘కత్తి’ ఫేమ్ మల్లి ద‌‌‌‌ర్శక‌‌‌‌త్వం వ‌‌‌‌హించాడు. 

క్యాథ‌‌‌‌లిన్ గౌడ హీరోయిన్‌‌‌‌గా నటించింది. ఇప్పటికే విడుద‌‌‌‌లైన ఫ‌‌‌‌స్ట్‌‌‌‌లుక్ పోస్టర్‌‌‌‌, టీజ‌‌‌‌ర్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబ‌‌‌‌రు 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.  కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ  చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. డిఫరెంట్ స్ర్కీన్‌‌‌‌ప్లే బేస్డ్ సినిమా ఇది అని దర్శక నిర్మాతలు చెప్పారు.