జూలై 19న హైకోర్టు కొత్త సీజేగా అపరేశ్ కుమార్ ప్రమాణం

జూలై 19న హైకోర్టు కొత్త సీజేగా అపరేశ్ కుమార్ ప్రమాణం
  • నేడు యాక్టింగ్ సీజే సుజయ్ పాల్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్‌‌‌‌‌‌‌‌)ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత జస్టిస్ ఏకే సింగ్ ఏడవ చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌గా నియమితులయ్యారు. త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన.. బదిలీపై తెలంగాణకు వస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.

నేడు యాక్టింగ్ సీజే సుజయ్ పాల్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు

ప్రస్తుతం మన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్.. కోల్‌‌‌‌‌‌‌‌కతా హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం  హైకోర్టు ఆయనకు వీడ్కోలు చెప్పనుంది. మధ్యాహ్నం 3:45 గంటలకు ఫస్ట్ కోర్టు హాల్లో న్యాయమూర్తుల ప్రత్యేక సమావేశం జరగనుంది. గత చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జనవరి 2025లో బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో, జనవరి 11 నుంచి జస్టిస్ సుజయ్ పాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.