
న్యూఢిల్లీ: ‘నోట్ల కట్టల జడ్జి’ అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే అంశంపై లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు సమష్టిగా తీసుకున్న ఈ నిర్ణయంపై చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం తెలిపారు. 152 మంది ఎంపీలు ఈ ప్రతిపాదనపై సంతకం చేశారని చెప్పారు.
జస్టిస్ వర్మ తొలగింపు అంశంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు కూడా ఇలాంటి ప్రతిపాదనను ఇచ్చాయి. జులై 21న లోక్‌సభలో ఈ ప్రతిపాదనగా వచ్చిన రోజే, రాజ్యసభలో కూడా నోటీసు సమర్పించారు. 63 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలతో ఈ ప్రతిపాదనను సమర్పించారు. అయితే దానిని అనుమతించలేదని రాజ్యసభ తాజాగా ప్రకటించింది.