హైదరాబాద్, వెలుగు: మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యామ్కోశీ ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి జస్టిస్ వినోద్‌కుమార్ కుటుంబసభ్యులతోపాటు అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అడ్వొకేట్ జనరళ్లు తేరా రజనీకాంత్‌రెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎస్. రాంరెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేంద్రరెడ్డి తదితరులు హాజరయ్యారు.
