
బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వయసున్న కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు తనకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తనకు కనీసం సీనియర్ అన్న గుర్తింపు ఉండేదని.. కానీ బీఆర్ఎస్ లో అదీ కూడా లేదన్నారు. తన కొడుకు విప్లవ్‌కు ఎమ్మెల్సీ అడిగితే ఇవ్వలేదని కేశవరావు చెప్పుకొచ్చారు. తనకు పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారని కేకే తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబం చీలిపోయిందని ఆరోపించారు. కుటుంబాల్ని విడదీసే రాజకీయాలెప్పుడూ తాను చేయలేదన్నారు. ఇది కేటీఆర్ చేశాడని తాను అనట్లేదని.. కానీ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు కేకే ఆయన కుమార్తె, మేయర్ గద్వాల విజయలక్ష్మి.