కాంగ్రెస్ది కుటిల యత్నం..సర్ పేరుతో రచ్చ చేసి, సభను అడ్డుకోవాలని చూశారు: కె. లక్ష్మణ్

కాంగ్రెస్ది కుటిల యత్నం..సర్ పేరుతో రచ్చ చేసి, సభను అడ్డుకోవాలని చూశారు: కె. లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కుటిల యత్నమే ఎజెండాగా పెట్టుకున్నదని రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఎస్ఐఆర్ పేరుతో పార్లమెంట్ సమావేశాల్లో రచ్చ చేసి, సభను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగాయన్నారు. ఎన్నికల సంస్కరణల్లో  భాగమే ఓట్ల ప్రక్షాళన అని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదన్నారు. వందేమాతరాన్ని, దేశాన్ని ముక్కలు చేసింది నెహ్రూ అని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.