ఆన్లైన్ లావాదేవీలతోకోట్ల వసూలుకు కుట్ర..కేంద్రంపై నారాయణ ఫైర్ 

ఆన్లైన్ లావాదేవీలతోకోట్ల వసూలుకు కుట్ర..కేంద్రంపై నారాయణ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: ఓట్ల చోరీ.. ఉద్యోగాల చోరీ అయిపోయాయి.. ఇప్పుడు ప్రజల జేబులకూ చిల్లు పెడుతున్నారని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్​అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్​చేశారు. డిజిటల్ ఇండియా పేరుతో ప్రజలను ప్రోత్సహించి, ఇప్పుడు అవే ఆన్‌‌లైన్ లావాదేవీల ద్వారా వారి నుంచి రూ.కోట్ల వసూలుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

అప్పట్లో రాజకీయ సంక్షోభం తలెత్తగా.. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో ప్రధాని మోదీ ఎలాగోలా బయటపడ్డారన్నారు. చీఫ్​ఎలక్షన్​కమిషనర్​జ్ఞానేశ్​కుమార్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.