అమెరికా, ఇండియా బంధం బలపడాలి: కాన్సాస్ సెనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేఏ పాల్ స్పీచ్

అమెరికా, ఇండియా బంధం బలపడాలి: కాన్సాస్ సెనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేఏ పాల్ స్పీచ్

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాలను వెంటనే ఆపాలని.. అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు మరింత బలపర్చాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. కాన్సాస్ స్టేట్ సెనేట్ సెషన్ ప్రారంభంలో భాగంగా కేఏ పాల్​ను గెస్ట్ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ప్రత్యేక ప్రార్థనకు ఆహ్వానించా రు. దాంతో శుక్రవారం ఆయన సెనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో సభ్యుల కోసం ప్రార్థన చేసి, ప్రసంగించారు.

" ఈ రోజు నేను కాన్సాస్ సెనెట్ సభ్యుల కోసం ప్రార్థన చేశాను. అమెరికా, ఇండియా మధ్య మెరుగైన సంబంధాల కోసం ప్రార్థించా ను. 58  ప్రధాన యుద్ధాలను ఆపాలని ప్రార్థించాను. యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు పోవడంతోపాటు ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయి. ప్రపంచ శాంతి, సమృద్ధికి అమెరికా, ఇండియా  నాయకత్వం వహించాలి" అని కేఏ పాల్ పేర్కొన్నారు.