మాకు విగ్రహాలు కాదు రాజ్యాధికారం కావాాలి: కేఏ పాల్

మాకు  విగ్రహాలు కాదు రాజ్యాధికారం కావాాలి: కేఏ పాల్

సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో పోటీ పడి 120 అడుగుల అంబేద్కర్  విగ్రహం పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.  ప్రజలను మోసం చెయ్యడానికే కేసీఆర్ విగ్రహం పెడుతున్నారని.. తమకు  విగ్రహం కాదని.. రాజ్యాధికారం కావాలన్నారు. అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం దక్కాలన్నారు.  తాను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకే తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. 

 సింగరేణిని కొనలేని వాళ్లు విశాఖను కొంటారా అని ప్రశ్నించారు కేఏ పాల్. ఉద్యమ సమయంలో ఆంధ్రులను తిట్టి.. ఇపుడు ఏపీని పొగుడుతారా? అని ప్రశ్నించారు. దేశం మరో శ్రీలంకగా మారుతోందని ధ్వజమెత్తారు.  2008లో 10 కోట్లు అడగటానికి కేసీఆర్ తన దగ్గరకు వచ్చారని కేఏ పాల్ అన్నారు.  తనతో సెల్ఫీలు తీసుకుంటారు కానీ.. కనీసం పార్టీకి ఒక్కరూ రూపాయి ఇవ్వరని అన్నారు. కేసీఆర్ తనను చిత్రహింసలు  పెట్టాలని చూస్తున్నారని.. ప్రజల కోసం తన ప్రాణాలివ్వడానికైనా సిద్దంగా ఉన్నానని చెప్పారు కేఏ పాల్.

అక్టోబర్ 1న జరగనున్న  గ్లోబర్ పీస్ సభను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని  కేఏ పాల్ అన్నారు.  అక్టోబర్1న గ్లోబల్ పీస్ సభ, 2వ తేదీన గ్లోబల్ పీస్ ఎకనమిక్ మీటింగ్ జరుగుతుందన్నారు.  హైదరాబాద్ కు చాలా మంది రావడానికి సిద్దంగా ఉన్నారని.. తన ఇన్విటేషన్ ను అంగీకరించి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలన్నారు.  ఈ సమ్మిట్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు
మేలు జరగుతుందన్నారు.