
కేఏ పాల్ కు ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ నిచ్చాయి. తాను పోటీ చేసిన నరసాపురం లోక్‌సభ స్థానంలో డిపాజిట్ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్ సమాచారం మేరకు కేఏ పాల్‌కు చాలా తక్కువ ఓట్లు మాత్రమే పడ్డాయి. నరసాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం కేఏ పాల్‌కు మధ్యాహ్నం 2.30 గంటలవరకు ఉన్న సమాచారం మేరకు 1509 ఓట్లు పడ్డాయి.