హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత, ప్రభుత్త ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. అక్రమ కట్టడాలు, కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ చేసి రంగంలోకి దిగుతోంది. దీంతో భూకబ్జాదారులు హైడ్రా పేరు చెబితేనే వణిపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రా పని తీరుపై ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పందించారు. మంచినీటి సరస్సులు, చెరువులను రక్షించేందుకు హైడ్రా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కూల్చివేతలను పారదర్శకంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ALSO READ | N కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టుకు వెళతా : హీరో నాగార్జున
హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చిన తరహాలోనే.. ఎంతటి వారినైనా వదలకుండా అక్రమ కట్టడాలను నేలమట్టం చేయాలన్నారు. తన, మన బేధం లేకుండా చెరువులను రక్షించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు పాల్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రులు కూడా ఎన్ కన్వెన్షన్ తరహాలోనే చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని.. వారివి కూడా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రభుత్వానికి నెల రోజులు టైం ఇస్తున్నామని కూల్చివేతలు జరపకపోతే తానే స్వయంగా హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతలు జరిగేలా చూస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.