ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు శాంతి అని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్దాలు కొనసాగుతున్నాయే కానీ శాంతి లేదన్నారు. తాము దాదాపు 190 దేశాల్లో శాంతిని తీసుకొచ్చామన్నారు. ప్రజాశాంతి పార్టీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టేనన్నారు.
అమీర్ పేటలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కేఏపాల్. ప్రజలు మోడీ పాలన కంటే బ్రిటీష్ పాలనే మేలంటున్నారని కేఏపాల్ అన్నారు. మణిపూర్, అస్సాంలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారన్నారు. కులాలు,మతాలు, ప్రాంతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు. ఇలాంటి కుల, మత రాజకీయాలు చేసే బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ దేశానికి ప్రజాశాంతి పార్టీనే చివరి హోప్ అని అన్నారు. ప్రజాస్వామ్యం రావాలంటే ప్రజలంతా ఏకం కావాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం రావాలంటే అది కేఏపాల్గ తోనే సాధ్యమవుతుందని గద్దర్ చెప్పేవారన్నారు . తాను అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. ఏ రోజైతే కులాలు మతాలకు అతీతంగా ఉంటామో.. ఆ రోజే గాంధీ, అంబేద్కర్ ఆత్మకు శాంతి కల్గుతుందన్నారు. పాకిస్థాన్ తో యుద్ధం కావాలా? ప్రజల మధ్య శాంతి కావాలో మోడీ, అమిత్ షా ఆలోచించుకోవాలన్నారు.