
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 12 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో తాము బరిలో నిలిచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల, కోదండరాం కాంగ్రెస్ కు మద్దతిస్తారని తాను ముందే చెప్పానన్నారు. షర్మిల లాగ తాను ప్యాకేజీ స్టార్ ను కాదన్నారు. కేఏ పాల్ ను కొనేవాడు భూమి మీదే లేరన్నారు. రేవంత్ రెడ్డికి మద్దతివ్వాలని బండ్ల గణేష్ తనకు కాల్ చేశారని చెప్పారు. కాంగ్రెస్ కంటే అవినీతి పార్టీ ప్రపంచంలోనే లేదన్నారు.
కేసీఆర్,కేటీఆర్ తనను బెదిరించి దాడులు చేయించి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు కేఏపాల్. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. కేఏపాల్ ను బెదిరించి రాజకీయం చేయాలంటే ఎవరి తరం కాదన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పగానే రైతు కుటుంబాలను ఇబ్బంది పెట్టారన్నారు. తన చారిటీ ద్వారా వచ్చే డబ్బులు అన్ని క్లోజ్ చేసి తనను రోడ్డుమీదకు ఈడ్చి ప్రజలకు సేవ చేయకుండా చేశారన్నారు. తాను ఇప్పటి వరకు ఐదు లక్షల వరకు ప్రజలకు పంపిణీచేశానన్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గానికి 100కోట్లు ఇస్తానని తెలిపారు.