జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌‌‌‌లో నేనే పోటీ చేస్తా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌‌‌కు ఓటేయొద్దు: కేఏ పాల్

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌‌‌‌లో నేనే పోటీ చేస్తా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌‌‌కు ఓటేయొద్దు: కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీకి ఓటు వేస్తానంటే తాను ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తాన‌‌‌‌ని, లేకపోతే తానే బరిలో నిలుస్తానని ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని, 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామ‌‌‌‌న‌‌‌‌ని హామీ ఇచ్చారు.

 అభివృద్ధి వద్దనుకుంటే దోచుకునేవారినే ఎన్నుకోండని, అంతేగానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల‌‌‌‌కు ఓటేయొద్దని ప్రజలను కోరారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భ‌‌‌‌వ‌‌‌‌న్‌‌‌‌లో మీడియాతో ఆయ‌‌‌‌న మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ఒక‌‌‌‌రిపై ఒకరు హైకమాండ్‌‌‌‌కు ఫిర్యాదు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.71 కోట్లు అవినీతి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మరో మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారన్నారు.