
సిగ్నలింగ్‌లో వచ్చిన తప్పిదం వల్ల కాచిగూడలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో రైలులో ఇరుక్కుపోయిన లోకో పైలట్ చంద్రశేఖర్‌ను బయటకు తీయడానికి 8 గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ రెండు కిడ్నీలు పాడై పోవడంతో అతని కాళ్లకు రక్తప్రసరణ తగ్గింది. దీంతో ఆయన కుడికాలును మోకాలి పై వరకు తొలగించారు. ఇప్పటికీ లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. ప్రస్తుతం ఆయన MICUలో చికిత్స పొందుతున్నారు.