
ఆన్ లైన్ లో ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు ఆర్డర్ ఇస్తే కాళీ బాక్సు వచ్చింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా లక్కిరెడ్డి పల్లెలో జరిగింది. ఆనంద్ అనే అతనికి కొద్దిరోజుల క్రితం మోకాళ్ల కింది భాగంలో ఆపరేషన్ జరిగింది. ఇందుకు గాను ఆనంద్ కాలుకి మరింత సౌకర్యం కోసం ఆన్ లైన్ లో గ్లోబల్ నర్వ్ సిక్స్ ప్యాక్ అనే వస్తువును ఆర్డర్ చేశాడు. దాని విలువ ఇదు వేల రూపాయలు. క్రెడిట్ కర్డ్ ద్వారా బిల్ పే చేశాడు. అయితే ఇంటికి కొరియర్ రాగా దాన్ని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్నపాటి బాక్స్ మాత్రమే వచ్చింది. దీంతో… కొరియర్ పంపిన సంస్థకు ఫోన్ చేయగా… తిరిగి పంపుతే పరిశీలిస్తామని తెలిపారు. కాగా లోకల్ పోలీస్టేషన్ లో తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు ఆనంద్.