కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి : కడియం

కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి : కడియం

సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. బుధవారం ఆయన వరంగల్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. “ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే 16ఎంపీ స్థానాలను గెలిపించండి. వివిధ దశలల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్రం నుండి నిధులు తేవాలి. ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు నెరవేర్చుకోవాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా… పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతోపాటు నిధులు కూడా కేటాయించారు. దీన్ని బట్టి తెలంగాణ పట్ల మోడీ వ్యతిరేకత తెలుపుతుంది. లింగంపల్లి రిజర్వాయర్ పనులు వెంటనే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు అసమర్థులు. మేడారం జాతరకు జాతీయ హోదా తేలేకపొయారు.

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతోనే నిజామాబాద్ లో రైతులు నామినేషన్ వేశారు. జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఎన్డీఏ, యూపిఏ కూటములు రెండు కాలిపోయిన 300స్థానాలు దాటే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలు 200 స్థానాలు గెలిచే అవకాశం కల్పిస్తుంది. ప్రాంతీయ పార్టీలు అన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి కేసీఆర్ ఫెడరల్ ఫ్రాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణలోఎంపీ స్థానాలన్నింటిని టీఆర్ఎస్ క్లిన్ స్వీప్ చేస్తే దేశంలో కేసీఆర్ ఖ్యాతి పెరుగుతుంది. దేశ రాజకీయాలు, ప్రజల సమస్యలపైన సమగ్ర అవగాహన కలిగిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. కమిట్మెంట్, కన్విన్షన్ ఉన్న నాయకుడు కేసీఆర్ “ అని తెలిపారు కడియం.