V6 News

ఓయూలో కైరోస్-2026 ఫెస్టివల్

ఓయూలో కైరోస్-2026 ఫెస్టివల్

ఉప్పల్, వెలుగు: ఓయూ ఇంగ్లీష్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో ‘కైరోస్-2026’ పేరిట లిటరేచర్​ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఈ వేడుకను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని, క్లాస్ రూమ్​ల నుంచే దేశ భవిష్యత్తు నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.

కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాసీం మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని, అన్ని విభాగాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఫెస్టివల్​లో భాగంగా సాహిత్య క్విజ్, కవితా వాచనం, స్పెల్ బీ, మీమ్ సృష్టి వంటి వినూత్న పోటీలు నిర్వహించారు. విజేతలకు ముగింపు వేడుకలో బహుమతులు అందజేయనున్నారు