
సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal agarwal) నటించిన తమిళ హారర్ మూవీ కరుంగాపియమ్(Karungapiyam). దర్శకుడు డీకే(Dk) తెరకెక్కించిన ఈ సినిమాలో.. రెజీనా, రైజా విల్సన్, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో కనిపించారు. గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అందుకే ఈ సినిమా థియేటర్స్ కి వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఓటీటీలో మాత్రం రిలీజ్ అవలేదు.
Another breathtaking movie on aha! ?#KajalKarthika Premieres April 9#Karthika @MsKajalAggarwal @ReginaCassandra @jananihere @aadhavkk @KalaiActor @iYogiBabu #DEEKAY pic.twitter.com/W1CRC3R0uz
— ahavideoin (@ahavideoIN) April 1, 2024
అయితే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ప్రకటన వచ్చింది. ఈ సినిమా తెలుగు ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా వారు దక్కించుకున్నారు. తెలుగులో ఈ సినిమాను కాజల్ కార్తీక(Kajal Karthika) పేరుతో ఏప్రిల్ 9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలా మరో హారర్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.