Satyabhama OTT Official: OTTకి వచ్చేసిన కాజల్ కొత్త సినిమా సత్యభామ

Satyabhama OTT Official: OTTకి వచ్చేసిన కాజల్ కొత్త సినిమా సత్యభామ

సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్షణం, గూఢచారి, మేజర్ సినిమాల ఫేమ్ శశికిరణ్ టిక్కా నిర్మించారు. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఇక పెళ్లి తరువాత కాజల్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందునుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. 

జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది ఈ మూవీ. కథలో కొత్తదనం లేకపోవడం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో నెల కూడా గడవక ముందే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 28 నుండి స్ట్రీమింగ్ కి వచ్చేసింది సత్యభామ మూవీ. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. దీంతో ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరి లేట్ ఎందుకు వీలుంటే మీరు కూడా వెంటనే చూసేయండి.