కేంద్ర మంత్రి పాటిల్‌‌‌‌కు  కాకా జీవిత చరిత్ర పుస్తకం అందజేత 

కేంద్ర మంత్రి పాటిల్‌‌‌‌కు  కాకా జీవిత చరిత్ర పుస్తకం అందజేత 
  •  ‘కాకా’ సేవలు, తెలంగాణ ఉద్యమ పాత్రను 
  • వివరించిన కుటుంబ సభ్యులు
  •     బుక్​ అందజేసిన మంత్రి వివేక్‌‌‌‌, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత గడ్డం వెంకటస్వామి ‘కాకా’ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌‌‌‌ పాటిల్‌‌‌‌కు బహుకరించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాకా కుమారులు మంత్రి గడ్డం వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌‌‌ వెంకటస్వామి, మనవడు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.

ఈ సందర్భంగా గడ్డం వెంకటస్వామి రాజకీయ ప్రస్థానం, పేదల కోసం ఆయన చేసిన పోరాటం, కేంద్ర మంత్రిగా అందించిన సేవలను మంత్రికి వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాకా పోషించిన పాత్ర, తెలంగాణ ప్రజల కోసం ఆయన చేసిన కృషిని వివరించారు. పేదల పక్షపాతిగా, కార్మికులు, బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడిగా గడ్డం వెంకటస్వామికి ఉన్న గుర్తింపును కుటుంబ సభ్యులు ప్రస్తావించారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని తెలిపారు. ‘కాకా’ జీవిత చరిత్ర ద్వారా ఆయన రాజకీయ, సామాజిక ప్రస్థానాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని ప్రచురించినట్లు చెప్పారు.