- నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు, కార్మిక నాయకులు, అధికారులు
వెలుగు నెట్ వర్క్ : దివంగత కాంగ్రెస్నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులతో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్మిక సంఘాల నేతల ఆధ్వర్యంలో కాకా ఫొటోలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
కొన్ని చోట్ల నాయకులు కేక్ లు కట్ చేసి, అన్నదానాలు చేయడంతో పాటు కార్మికులు, మహిళలకు దుప్పట్లు, చీరలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి, పేదల నివాస హక్కుల కోసం కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల కాంగ్రెస్ నాయకుడు మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో ర్యాలీ, అన్నదానం చేశారు.
