కాకా లక్షమంది కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారు : వివేక్ వెంకటస్వామి

కాకా లక్షమంది కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారు : వివేక్ వెంకటస్వామి

కాకా లక్షమంది కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణి సంస్థ నష్టాల బారిన పడినప్పుడు రూ. 400 కోట్లను ఇప్పించి సంస్థను కాపాడారని గుర్తు చేశారు. కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 

కాకా జీవితం సామాన్యుడిగా ప్రారంభించి 70 వేల మంది నిరుపేదలకు ఇంటి  స్థలాలు ఇప్పించే దాక వెళ్ళిందని అన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ కోసం రూ. 5 వేల కోట్ల బడ్జెట్ ను రూ. 25 వేల కోట్లకు పెంచేందుకు కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం అది రూ. లక్ష కోట్లకు చేరుకుందన్నారు. 

ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసే కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకా కే దక్కుతుందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ను ఒప్పించి ప్రాజెక్టు ఏర్పాటుకు కృషి చేశారన్నారు. హెచ్ సిఏ ప్రెసిడెంట్ గా తాను  ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించానని తెలిపారు. 

పెద్దపల్లి పార్లమెంటుకే పరిమితం కాకుండా క్రికెట్ క్రీడను తెలంగాణ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వచ్చే ఏడాది నుంచి కాకా వెంకటస్వామి స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. యువనేత గడ్డం వంశీకృష్ణ  ఆలోచనతోనే తెలంగాణ స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని వివేక్ వెంకటస్వామి అన్నారు.