కాళేశ్వరం అప్పు రూ.87 వేల 449 కోట్లు,

కాళేశ్వరం అప్పు రూ.87 వేల 449 కోట్లు,

కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్ బిల్లులు రూ.3,192.08 కోట్లు ఉన్నాయని ఈఎన్సీ వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం చేసిన బిల్లుల్లో రూ.1,915.88 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా,  రూ.576.57 కోట్లు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సి ఉందని తెలిపారు. భూసేకరణ బిల్లులు రూ.466.58 కోట్లు, పునరావాసం కోసం రూ.229.15 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. సబ్ స్టేషన్లకు రూ.2.43 కోట్లు, కేపీఎంజీ కన్సల్టెన్సీకి రూ.1.18 కోట్లు, ఎన్పీడీసీఎల్ కు రూ.25 లక్షల బిల్లు బకాయి ఉందన్నారు.

కాళేశ్వరం అప్పు రూ.87,449 కోట్లు

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం (అడిషనల్ టీఎంసీని కలుపుకొని) యూనియన్ బ్యాంక్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్​ కార్పొరేషన్ల ద్వారా రూ.87,449.16 కోట్ల లోన్లు శాంక్షన్ అయ్యాయి. అందులో రూ.71,565.69 కోట్లు తీసుకున్నారు. ఇంకా ఆర్థిక సంస్థల నుంచి రూ.15,698.91 కోట్లు విడుదల కావాల్సి ఉంది. తీసుకున్న లోన్ల నుంచి ఇప్పటి వరకు రూ.4,696.33 కోట్ల అసలు రీ పేమెంట్ చేశారు. గడిచిన ఐదేండ్లలో తెచ్చిన అప్పులకు వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 

మొత్తం కలిపితే రూ.21,157.87 కోట్లు తిరిగి చెల్లించారు. కాళేశ్వరం కార్పొరేషన్‌‌‌‌లో భాగమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల లోన్ శాంక్షన్ కాగా.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.7,721.51 కోట్లు రిలీజ్​చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు రిలీజ్ కావాల్సి ఉంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గడిచిన మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించారు. ఈ అప్పులకు సంబంధించి అసలు చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు” అని ఈఎన్సీ మురళీధర్ వివరించారు.