కాళేశ్వరం ఎస్సై.. మహిళా కానిస్టేబుల్స్ పై లైంగిక వేధింపులు..

కాళేశ్వరం ఎస్సై..  మహిళా కానిస్టేబుల్స్ పై లైంగిక వేధింపులు..

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్‎స్టేషన్‎లో దారుణం జరిగింది. కాళేశ్వరం ఎస్సైగా పని చేస్తున్న భవానీసేన్ పోలీస్‎స్టేషన్‎లోని మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విషయం బయటకు చెప్తే తుపాకీతో చంపుతానని బెదరించినట్లు మహిళా కానిస్టేబుల్ చెబుతున్నారు.

 అయితే ఎస్పీకి మహిళా కానిస్టేబుల్ విషయం చెప్పడంతో నిన్న రాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐల విచారణ చేపట్టారు. విచారణలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను వేధించినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో SI భవానీసేన్‎పై వేధింపులు, SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.