ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన నేపథ్యంలో ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడెప్పుడు సెట్స్‌కు వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రెండో భాగం చిత్రీకరణను ప్రారంభించారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా వెల్లడించారు. ‘గిరఫ్తార్’ (1985) చిత్రం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు కమల్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందంటూ.. సెట్‌లో ఇద్దరూ కలిసున్న ఫొటోస్ సహా అశ్వత్థామ గెటప్‌లో ఉన్న తన ఫొటోస్‌ను ఆయన తన బ్లాగ్‌లో షేర్ చేశారు. ఇందులో సుప్రీమ్ యాస్కిన్ అనే విలన్ పాత్రను కమల్ హాసన్ పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇక భైరవ పాత్రతో పాటు కర్ణుడిగా నటిస్తున్న ప్రభాస్.. మార్చి నెలలో ఈ మూవీ సెట్‌లో జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. మైథాలజీని, సైన్స్‌ను కలగలిపి నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
