నీట్ స్టేట్ ర్యాంకులు రిలీజ్

నీట్ స్టేట్ ర్యాంకులు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: నీట్ స్టేట్ ర్యాంకులను కాళోజీ హెల్త్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. తెలంగాణ నుంచి సుమారు 30 వేల మంది నీట్ క్వాలిఫై అయినప్పటికీ, 14,759 మంది మాత్రమే కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆలిండియా 37వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాసా లహరి స్టేట్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో తొలి స్థానంలో ఉండగా, ఆలిండియా 9,21,531 ర్యాంక్ వచ్చిన వ్యక్తి స్టేట్‌‌‌‌‌‌‌‌లో 14,759 ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లలో 5,227 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.  
పీజీ షెడ్యూల్ విడుదల..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా పీజీ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ పీజీ క్వాలిఫై అయినవాళ్లు ఈ నెల 15న ఉదయం 8 గంటల నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ( www.knruhs.telangana.gov.in )లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.