
హైదరాబాద్, వెలుగు: కన్వీనర్ కోటా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ల కోసం కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్-పీజీ-2025 లో అర్హత సాధించిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్ల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అక్టోబర్ 1 ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు పది వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎనిమిది వేలుగా నిర్ణయించింది. ఎంబీబీస్ గ్రాడ్యుయేట్స్ జూలై 31లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలని నోటిఫికేషన్ లో సూచించింది.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని వివరించింది. మరిన్ని వివరాల కోసం https://knruhs.telangana.gov.in, https://tspgmed.tsche.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది. అప్లికేషన్ ఫారంలో సిగ్నేచర్, ఫొటో, డిక్లరేషన్ ఏరియా సరిగ్గా అప్ లోడ్ చేయకపోతే రిజెక్ట్ చేస్తామని తెలిపింది. టెక్నికల్ హెల్ప్ కోసం 93926 85856, 78421 36688, 90596 72216, రూల్స్ ఇతర వివరాల కోసం 79010 98840, 93905 55796 నంబర్లను సంప్రదించాలని పేర్కొంది.
కటాఫ్ స్కోర్లు ఇలా...
కేటగిరీ కనీస అర్హత కటాఫ్ స్కోరు
జనరల్/ఈడబ్ల్యూఎస్ 50వ పర్సంటైల్ 276
జనరల్ పీడబ్ల్యూడీ 45వ పర్సంటైల్ 255
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ 40వ పర్సంటైల్ 235