నీట్​లో 44,629 మంది క్వాలిఫై!

నీట్​లో 44,629 మంది క్వాలిఫై!

హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీలో క్వాలి ఫై అయిన తెలంగాణ స్టూడెంట్ల వివరాలను కాళో జీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం విడుదల చేసింది. స్టూడెంట్ల పేర్లు, హాల్ టికెట్  నం బర్లు, మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకులతో కూడిన జాబితాను వర్సిటీ తన వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచింది. నీట్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో తెలంగాణ స్టూడెంట్లుగా పేర్కొన్న​అందరి వివరాలను లిస్టులో  పొం దుపర్చామని, అయితే ఇదే ఫైనల్ లిస్టు కాదని సోమవారం విడుదల చేసిన ఓ నోట్‌‌‌‌‌‌‌‌లో వర్సిటీ పేర్కొంది. 

కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే విడుదల చేస్తామని, అప్పుడు స్టూడెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఆ టైమ్​లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్  చేసే సర్టిఫికెట్లను వెరిఫై చేశాక మెరిట్ లిస్ట్‌‌‌‌‌‌‌‌  ప్రకటిస్తామని చెప్పింది. వర్సిటీ రిలీజ్ చేసి న జాబితా ప్రకారం రాష్ట్రం నుంచి 44,629 మంది క్వాలిఫై అయినట్లు తెలుస్తోంది.