హైదరాబాద్, వెలుగు: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఈ నెల 31న చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారించనుంది.
మంగళవారం అప్పీల్‌ను అత్యవసరంగా విచారించేందుకు బెంచ్ నిరాకరించింది. అప్పీల్ పిటిషన్‌కు రిజిస్ట్రీ నెంబర్ కేటాయింపు జరగలేదని గుర్తు చేసింది. నెంబర్ కేటాయింపు తర్వాత విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
