
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (ఆగస్ట్ 27) నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వాన పడుతోంది. వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టుపై ఉన్న చెరువుకు గండి పడింది.
Also read:ప్రాజెక్ట్ లకు జలకళ.. మిడ్ మానేరు 17 .. జూరాల ప్రాజెక్ట్ 16 గేట్లు ఓపెన్..
చెరువు కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి వస్తోంది. కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 405 అడుగులు కాగా చెరువు కట్ట తెగిపోవడంతో ప్రాజెక్ట్‌కు స్థాయికి మించి ప్లడ్ వస్తోంది. కల్యాణి ప్రాజెక్టుకు గండి పడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు.. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని సంగం హజీపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.