ప్రాజెక్ట్ లకు జలకళ.. మిడ్ మానేరు 17 .. జూరాల ప్రాజెక్ట్ 16 గేట్లు ఓపెన్..

ప్రాజెక్ట్ లకు జలకళ.. మిడ్ మానేరు 17 .. జూరాల ప్రాజెక్ట్ 16 గేట్లు  ఓపెన్..

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ... ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో  ప్రాజెక్ట్​లు జలకళను సంతరించుకున్నాయి.   మిడ్​ మానేరు.. జూరాల ప్రాజెక్ట్​లకు భారీగా వరదనీరు చేరుతుంది. మిడ్​ మానేరుకు వరద నీరు పోటెత్తింది.ప్రస్తుతం  62, 830 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.  ఎస్సారెస్పీ నుంచి 16, 365  క్యూసెక్కులు, ములవాగు, మానేరు ల నుండి 44, 105 వేల క్యూసెక్కులు ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది.  17 గేట్లను ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు. 23, 280 వేల క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీ కి... 9, 600 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్ కు విడుదల చేశారు.  మిడ్‌‌‌‌ మానేరు పూర్తిస్థాటి నీటి నిల్వ సామర్థ్యం 27.679  టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20261 టీఎంసీల నీరు చేరింది. 

జారాల ప్రాజెక్ట్​ కు...

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుండగా...  16  గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.  జూరాల డ్యాం వద్ద ఇన్ ఫ్లో : 1,70,000 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 1,78,542 క్యూసెక్కులు..పూర్తి స్దాయి నీటి మట్టం  318.516 మీటర్లు...పూర్తి స్దాయి నీటి మట్టం  318.516 మీటర్లు ..  ప్రస్తుతం : 318.110 మీటర్లు..  పూర్తిస్థాయి నీటి నిల్వ : 9.657 టీఎంసీలు..  ప్రస్తుతం : 8,830 టీఎంసీల వరద నీటితో ప్రాజెక్ట్​ కళకళతుంది.