అదిరే అభి డైరెక్టర్ గా కామాఖ్య మూవీ ప్రారంభం

అదిరే అభి డైరెక్టర్ గా కామాఖ్య మూవీ ప్రారంభం

‘జబర్దస్త్’ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న అదిరే అభి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘కామాఖ్య’.  మిస్టీరియస్  థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సమైరా,  సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, ఆనంద్, శరణ్య ప్రదీప్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.   మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

ఆదివారం జరిగిన ఈ  సినిమా ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై   ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.  గ్యానీ  సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.