క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న క‌మ‌ల్ హాస‌న్

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న క‌మ‌ల్ హాస‌న్

క‌రోనా నుంచి కోలుకున్నారు సినీ నటుడు  క‌మ‌ల్ హాస‌న్.  కమల్ ప్రస్తుతం కోవిడ్ నుంచి పూర్తి కోలుకున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు  తెలిపారు. తాజాగా ఆయన ఆరోగ్య పరసిత్థిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత కమల్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా..  పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో నవంబర్  22న కరోనాతో  చెన్నైలోని రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో క‌మ‌ల్ హాస‌న్ జాయిన్ అయ్యారు. ఆయన కరోనా నుంచి కోటుకున్నట్లుగా ఆసుపత్రి హెల్త్ బులెటిన్ లో తెలిపింది.  ఈ నెల 3న డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. ఈ నెల 4 నుంచి కమల్ తన పనులను చేసుకోవచ్చని చెప్పారు.