కన్నడ సినీ పరిశ్రమలో 'డింపుల్ క్వీన్'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రచితా రామ్‌కు తన పుట్టినరోజునే ఊహించని అనుభవం ఎదురైంది. ఈ రోజు ( అక్టోబర్ 3, 2026 ) అభిమానులతో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆమె.. వారితో సరదాగా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అయితే ఓ అభిమాని చేసిన పని మాత్రం అందరిని షాకింగ్ కు గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగుతున్న సమయంలో.. ఓ వ్యక్తి రచిత వద్దకు వచ్చాడు. తొలుత ఆమెతో సెల్ఫీ తీసుకున్న అతడు.. అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతా సాధారణంగానే సాగుతుందని అనుకునేలోపే ఒక్కసారిగా రచిత రెండు బుగ్గలను పట్టుకుని గిల్లి అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటన క్షణాల్లో జరిగిపోవడంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది కూడా అతడిని వెంటనే అడ్డుకోలేకపోయారు.
ఈ ఊహించని పరిణామంతో రచిత కాసేపు షాక్‌కు గురైనప్పటికీ.. ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో కూల్ అయ్యారు. అనంతరం యథావిధిగా అభిమానులతో ఫొటోలు దిగుతూ బర్త్‌డే వేడుకలను కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీనిని సరదా ఘటనగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. అభిమానమంటే సెలబ్రిటీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ.. హద్దులను దాటడం కాదని కామెంట్లు చేస్తున్నారు.
ఇక రచిత తెలుగులో 'సూపర్ మచ్చి', తమిళంలో రజనీకాంత్ 'కూలీ'తోనూ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం 'కాకా' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీంతో రచితా రామ్ కెరీర్ మరో ఆసక్తికర మలుపు తిరుగుతోంది..
😄 Be honest, what kind of fan are you—playful 😜 or calm 😇?
— Filmyyy__duniyaaa (@Filmyduniyaaa) October 3, 2026
Which one are you? 👀#RachitaRam pic.twitter.com/F3A16HFc9W
