ఒకటి రెండ్రోజుల్లో కమల్ డిశ్చార్జ్ : డాక్టర్లు

ఒకటి రెండ్రోజుల్లో కమల్ డిశ్చార్జ్ : డాక్టర్లు

స్పల్ప అస్వస్థతతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరిన  సినీనటుడు కమల్ హాసన్  హెల్త్ బులిటెన్ వచ్చింది. కమల్ కోలుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని వైద్యులు వెల్లడించారు. శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో ప్రస్తుతం కమల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం  ఒకటి రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. 

నిన్ననే  హైదరాబాద్‭కు వచ్చిన కమల్ హాసన్..  ప్రముఖ దర్శకుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వనాథ్‭ని కలిశారు. విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలకరించారు. కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకతో విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఎంతో సంతోషించారు.  ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు.  సాయంత్రం తిరిగి కమల్ చెన్నై వెళ్లిపోయారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కమల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.