
నరేంద్ర మోడీ ఈనెల 30వ తేదీన రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆ వేడుకకు హాజరుకావాలంటూ తమిళనాడుకు చెందిన మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు ఆహ్వానం అందింది. 30వ తేదీన రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మోడీతో ప్రమాణం చేయిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 352 సీట్లు గెలుచుకున్నది.