
కోయంబత్తూర్: మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్న కమల్ అక్కడి ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. సిటీలోని రేస్ కోర్సు రోడ్డులో వాకింగ్ చేస్తున్న వారితో మాట్లాడారు. తర్వాత రామనాథపురంలోని ఓ జిమ్‌కు వెళ్లారు. అక్కడ తమిళనాడు సాంప్రదాయ కళ ‘సిలంబట్టమ్’ను ప్రదర్శించారు. తరువాత రోడ్డు పక్కన టీ షాపు వద్ద ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేపల మార్కెట్ కు కూడా వెళ్లి జనం సమస్యలపై ఆరా తీశారు. కోయంబత్తూరులో బంగారు ఆభరణాల పార్కు ఏర్పాటు చేయాలని కమల్ హాసన్‌కు జ్యూయలరీ తయారీదారుల సంఘ సభ్యులు మెమోరాండం ఇచ్చారు.