'ఇండియన్ 2' పోస్టర్ రిలీజ్

'ఇండియన్ 2' పోస్టర్ రిలీజ్

స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ లోనే ది బిస్ట్ మూవీగా నిలిచిన (భారతీయుడు) ఇండియన్ కు స్వీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనా.. మధ్యలో కరోనా వంటి పలు కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. తాజాగా ఇండియన్ 2 షూటింగ్ మొదలైందంటూ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్, రకుల్ ప్రీత్ సహా ఇతర నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పాటు ఈ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పిక్ లో కమల్ హాసన్ ఓ లెవల్లో కనిపిస్తున్నారు. తెలుపు రంగు దుస్తులు ధరించిన ఆయన.. కండువాను భుజంపై వేసుకునేటట్టుగా ఉండడాన్ని ఈ పోస్టర్ లో గమనించవచ్చు.

డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో 21ఏళ్లకు ముందు భారతీయుడు సినిమా రిలీజై బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఆ మూవీ ఎంత హిట్ అయిందో.. మళ్లీ అదే స్థాయిలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందా లేదా తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు ఆగాల్సిందే. ఇక రామ్ చరణ్ తో RC 15సినిమానూ సెట్స్ పైకి తీసుకెళ్లిన శంకర్ కు ఎదురు దెబ్బ తగిలింది. అప్పట్లో ఇండియ‌న్ 2 నిర్మాత‌లు శంక‌ర్‌పై కేసు వేయ‌టానికి కూడా సిద్ధమ‌య్యారని సమాచారం. కానీ.. శంక‌ర్ మ‌ళ్లీ సినిమాను చేస్తాన‌ని స‌ర్ది చెప్పి వ్యవ‌హారాన్ని పెద్దది కాకుండా చూశారట. మ‌రో వైపు రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తోన్న RC 15 చిత్రీక‌ర‌ణ కాస్త ఆగింది. ఇక్కడ కూడా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ రావ‌టంతోనే ఆగిన‌ట్లు టాక్ అయితే బ‌లంగానే వినిపిస్తోంది.