ఆదిపురుష్: ముందు ప్రభాస్ కాదు.. ఆ హీరో లక్కీ

ఆదిపురుష్: ముందు ప్రభాస్ కాదు.. ఆ హీరో లక్కీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన భారీ చిత్రం ఆదిపురుష్(Adipurush). డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) తెరకెక్కించిన ఈ చిత్రం సోషల్ మీడియాలో విమర్శలతో పాటు.. బాక్సాఫీసు వద్ద చేదు ఫలితాన్నే చవి చూస్తోంది. రామాయణం పేరుతో విజువల్ వండర్ గా ఈ మూవీని తీయాలనుకున్నాడు ఓం రౌత్ కానీ.. పిల్లలు ఆడుకునే వీడియో గేమ్ లా డిజైన్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.   

ALSO READ: లస్ట్ స్టోరీస్2.. కుర్రోళ్ల మతి పోగొడుతున్న తమన్నా

ఇక తాజాగా ఆదిపురుష్ సినిమాపై బాలీవుడ్ యాక్టర్,ప్రొడ్యూసర్ కమల్ రషీద్ ఖాన్(Kamal Rashid khan) చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. "తన్హాజీ(Tanhaji) మూవీ చూసినప్పుడు.. ఓం రౌత్ కి దర్శకత్వమే రాదంటూ గతంలో నేను చేసిన కామెంట్స్ ఆదిపురుష్ మూవీ తో నిజమయ్యాయి. ముందుగా ఆదిపురుష్ సినిమా కోసం ఆర్యన్ కార్తీక్(Aryan karthik) ను అనుకున్నారు. కానీ అతను ఒప్పుకోకపోవడమే మంచిదయ్యింది" అంటూ ట్వీట్ చేశాడు కేఆర్కే. దీంతో ఆదిపురుష్ సినిమాపై కేఆర్కే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.