లస్ట్ స్టోరీస్2.. కుర్రోళ్ల మతి పోగొడుతున్న తమన్నా

లస్ట్ స్టోరీస్2.. కుర్రోళ్ల మతి పోగొడుతున్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannaah) నటించిన లేటెస్ట్ బోల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్2(Lust Stories2). జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్ నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ లో బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయింది తమన్నా. ఈ సిరీస్ లో తమన్నాతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ(Vijay varma) కూడా నటించాడు.

ఈ జంట కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కలిసి నటించిన మొదటి సినిమాలోనే ముద్దులు,హగ్గులు, రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ జంట. ఈ ఇద్దరి రొమాన్స్ తోనే సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగిపోయాయి. సినిమాల‍్లో హీరోయిన్ గా చేసినప్పుడు ఎలాంటి సీన్లకు దూరంగా ఉన్న తమన్నా.. ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వగానే గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఇటీవలే రిలీజైన 'జీ కర్దా' వెబ్ సిరీస్ లో కూడా బూతు సీన్లు, బూతు డైలాగ్స్ తో రెచ్చిపోయింది.

ALSO READ: ఆదిపురుష్ టీంను నిలబెట్టి కాల్చేయాలి.. ముకేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్

ఇక లస్ట్ స్టోరీస్2 ట్రైలర్ చూస్తుంటే.. లస్ట్ స్టోరీస్ ఫస్ట్ పార్ట్ లాగే ఇందులోనూ బోల్డ్ డొసేజ్ బాగానే కనిపించింది. మరి ట్రైలర్ తొనే ఈ రేంజ్ రచ్చ చేస్తున్న ఈ సిరీస్ రిలీజ్ తరువాత ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.