
ఆదిపురుష్(Adipurush) టీమ్ ను నిలబెట్టి కాల్చేయాలంటూ సంచలన కామెంట్స్ చేశాడు నటుడు ముకేష్ ఖన్నా(Mukhesh khanna). తాజాగా ఆయన ఆదిపురుష్ సినిమాలో చేసిన మార్పులపై మండిపడుతూ కామెంట్స్ చేశాడు..
“రామాయణాన్ని మీ సొంత వెర్షన్ లో తీయడానికి మీరు వాల్మీకి కంటే గొప్పవారా? ఓం రౌత్(Om Raut), మనోజు ముతాషిర్ శుక్లా(Manoj Munthashir Shukla) రామాయణాన్ని కనీసం చదివి ఉండరు. రావణుడికి వరం ఎవరు ఇచ్చారో కూడా వారికి తెలియదు. హిరణ్యకశిపుడు పొందిన వరాన్ని రావణాసురుడికి అంటగట్టారు. హనుమంతుడితో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడించారు. ఆదిపురుష్ టీం చేసిన ఈ పనిని అసలు క్షమించమని, టీమ్ మొత్తాన్ని 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిలబెట్టి కాల్చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు ముకేష్ ఖన్నా చేసిన ఈ కామెంట్స్ ఇటు ఇండస్ట్రీలోనూ, అటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి
ALSO READ: భారీగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్.. కేవలం రూ.10.8 కోట్లు
ఇక తాజాగా ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ నరేంద్ర మోదీకి (Narendra Modi) లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ వ్యతిరేకతతో మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి.