భారీగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్.. కేవలం రూ.10.8 కోట్లు

భారీగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్.. కేవలం రూ.10.8 కోట్లు

ఆదిపురుష్(Adipurush) మూవీ విషయంలో డైరెక్టర్ ఓం రౌత్( Om Raut) చూపించిన ప్రతి  ఫ్రేమ్ లో తప్పులున్నాయంటూ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. పండితుల నుండి సామాన్య ప్రజల వరకు ఆదిపురుష్ విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ విజువల్ వండర్ గా నిలుస్తుందనుకుంటే..  వివాదాలతో నడుస్తుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి మూడు రోజులు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ సోమ, మంగళవారాల్లో మాత్రం మూవీ కలెక్షన్స్  పూర్తిగా తగ్గిపోయాయి. ఈ మూవీ మంగళవారం భారతదేశంలోని అన్ని భాషలలో కలిపి కేవలం రూ.10.80 కోట్లను మాత్రమే రాబట్టింది. సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ కారణం గానే కలెక్షన్స్ భారీగా తగ్గాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రిలీజైన ఫస్ట్ వీకెండ్ లోనే  70 శాతం వసూళ్లు పడిపోవడంతో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.