
కమలాపూర్, వెలుగు: ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ కానిస్టెన్సీలోని కమలాపూర్ మండల క్యాడర్ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ విప్‌గా ప్రమాణం చేసిన రోజునే డుమ్మాకొట్టి తమ అసంతృప్తిని వెల్లగక్కారు. కౌశిక్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కుడి భుజంగా ఉంటూ, నిత్యం వెన్నంటి ఉంటూ అతని ఎదుగుదలకు తోడ్పాటునదించిన నియోజకవర్గ స్థాయి లీడర్లే కౌశిక్‌కు దూరమయ్యారు. కొన్ని నెలల క్రితం వరకు నియోజకవర్గస్థాయి లీడర్‌గా ఉన్న కౌశిక్‌కు.. సీఎం కేసీఆర్ఎమ్మెల్సీ సీటు కట్టబెడితే పదవిని చేపట్టిన తర్వాత కౌశిక్ తీరులో మార్పు వచ్చిందని లీడర్లు చర్చించుకుంటున్నారు. సమస్యలు, పనుల గురించి వెళ్లి కలిస్తే పట్టించుకోకపోవడంతో పాటు విలువ ఇవ్వకుండా, కనీసం ఫోన్లో కూడా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
దీనిపై కొంత కాలం క్రితం సోషల్‌మీడియా వేదికగా లీడర్లు తమ అసహనాన్ని బహిరంగంగానే వెల్లగక్కారు. ఉద్యమంలో, పార్టీలో ఆది నుంచి పనిచేస్తూ బీఆర్ఎస్కు మైలేజీ తీసుకొచ్చిన కానిస్టెన్సీ స్థాయి లీడర్లకు ఎలాంటి ప్రయార్టీ లేదని, పదవులు జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక మండలాల లీడర్లకే దక్కుతున్నాయని మండిపడుతున్నారు. ఫంక్షన్లు, మృతుల కుటుంబాల పరామర్శలకు వచ్చినపుడు స్థానిక లీడర్లపైనే ఆర్థిక భారం మోపుతున్నారన్న ఆరోపణలను సైతం లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే లీడర్లకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తూ .. ప్రమాణ స్వీకారోత్సవాన్ని బాయ్ కాట్ చేసినట్లుగా తెలిసింది. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు, పనులకు దూరంగా ఉంటూ అంటీ ముట్టనట్లు వ్యవహరించాలన్న ఆలోచనలో స్థానిక లీడర్లు ఉన్నట్టు సమాచారం.